telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. పెళ్లిళ్లకు కొత్త రూల్స్‌.. ఉల్లంఘించేవారిపై చర్యలు

ఎపీ సీఎం జగన్‌ స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయాలని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం కోవిడ్‌ నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని యూనిట్‌గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ వేసుకుంటూ వెళ్లాలని సూచించారు.

స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.. అధికారులకు స్పష్టం చేశారు జగన్‌. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలన్నారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన అన్నారు. స్కూళ్లలో టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలి అన్నారు. వ్యాక్సినేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే… ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

నిర్దేశించిన విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలన్నారు. పీహెచ్‌సీలు మొదలుకుని సీహెచ్‌సీలు బోధనాసుపత్రుల వరకు రిక్రూట్‌మెంట్‌ పూర్తిచేయాలన్నారు. 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆతర్వాత ఎక్కడా కూడా సిబ్బంది లేరన్న మాట వినిపించకూడదన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో నాడు – నేడు పనులను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related posts