telugu navyamedia
క్రైమ్ వార్తలు

శ్రీకాకుళంలో ఘోర రైలు ప్రమాదం..ఐదుగురు మృతి..

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌ శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం – విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీపంలో సోమవారం రాత్రి జరిగింది.. .

వివ‌ర్లాలోకి వెళితే..

సికింద్రాబాద్‌ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లో చీపురు పల్లి దాటిన ఒక బోగీ లోంచి పొగలు వచ్చాయి. ఆందోళనకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలు ఆపేశారు. దీంతో బోగీల్లో ఉన్న కొందరు ప్రయాణికులు కిందకు దిగి పక్క ట్రాక్‌పైకి వెళ్లారు.

Train runs over 5 while crossing tracks in Srikakulam- The New Indian Express

ఇదే సమయంలో విశాఖ నుంచి వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఘటనా స్థలంలో చెల్లా చెదురుగా మృతదేహాలు పడిపోయాయి..మృతులలో ముగ్గురు వ్యక్తులు అస్సాం రాష్ర్టానికి చెందిన పసుమంత్రి వజులు, బనిషర్ బసుమంత్రి , రసిదుల్ ఇస్లాంగా పోలీసులు గుర్తించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం విజయనగరం ఎంఆర్ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు‌ చేసిన‌ ‌పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.

Related posts