విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే ఓ విద్యార్థి కొట్టుకుపోయాడు. వీరంతా నారాయణ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విద్యార్థి తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మధ్యాహ్నం గల్లంతైనప్పటికీ పోలీసులు ఇప్పటికీ ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు. నారాయణ కాలేజ్ ఆసిల్ మెట్ట క్యాంపస్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జగదీష్ అనే విద్యార్థి ఆదివారం కావడంతో తోటి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లాడు. సరదాగా సముద్ర స్నానానికి దిగిన జగదీష్ స్నేహితుల కళ్లముందే సముద్రంలో గల్లంతయ్యాడు.