రైతుల ఆందోళనను వెంటనే ఉపసంహరించుకునేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికైత్ శుక్రవారం అన్నారు. “నిరసనల ఉపసంహరణపై పార్లమెంటులో వివాదాస్పద చట్టాలను రద్దు చేసిన తర్వాతే మేము నిర్ణయం తీసుకుంటామని BKU నాయకుడు చెప్పారు . పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్పి) తదితర అంశాలపై ప్రభుత్వం రైతులతో మాట్లాడాలని ఆయన నొక్కి చెప్పారు.
నిరసనలు తెలిపిన రైతు సంఘాలు శనివారం సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. సింగు సరిహద్దు వెంబడి నిరసనలు తెలుపుతున్న రైతులు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినందుకు సంబరాలు చేసుకోవడం కనిపించింది. అయితే, వెంటనే నిరసనలు ఉపసంహరించుకోలేము, పార్లమెంటులో వ్యవసాయ చట్టాలను రద్దు చేసే రోజు కోసం మేము వేచి ఉంటామని స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్లో పార్లమెంట్లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పారు. అలాగే వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం “రైతుల్లోని ఒక వర్గాన్ని ఒప్పించడంలో విఫలమైంది” అని అన్నారు. ఈ నెలలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే మూడు వివాదాస్పద చట్టాలను రద్దు చేయనున్నట్టు తెలిపారు.
“నేను భారతదేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని లాంఛనాలు పూర్తి చేస్తామని’’ అని ప్రధాని మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు.

