telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారు: మంత్రి బొత్స

minister bosta in vijayawada meeting

లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.

కరోనా నియంత్రణకు రాష్ట్రంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హాట్ స్పాట్స్ గుర్తించిన ప్రాంతాల్లో ప్రజలకు వారి ఇళ్లకే నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నామని, అవసరమైన మందులు కూడా అందిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని మంత్రి అన్నారు. రోజుకు రెండు వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Related posts