telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తన కాన్వాయ్ ఆపి మరి .. అంబులెన్స్‌కు దారిచ్చిన .. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ …

fadnavis convoy given way to ambulance

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ గుండె మార్పిడి ఆపరేషన్‌ కోసం తరలివెళ్తున్న అంబులెన్స్‌కు దారిఇచ్చేందుకు ఏకంగా తన కాన్వాయ్‌ను నిలిపివేశారు. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గ్రీన్‌ కారిడార్‌ను రూపొందించిన పుణే పోలీసులు ఇలా వేగంగా అవయవాలను సంబంధిత ఆస్పత్రికి చేర్చడం ఇది వందో సారి కావడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూణే రుబీ హాల్‌ క్లినిక్‌లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం సోలాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రి నుంచి చార్టర్డ్‌ విమానంలో పూణేలోని లోహెగావ్‌ విమానాశ్రయానికి చేరుకున్న దాత గుండె చేరుకుంది.

రుబీ హాల్‌ ఆస్పత్రికి తరలాల్సిన గుండెను సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు గ్రీన్‌ కారిడార్‌పైకి తీసుకురాగా, అదే సమయంలో సీఎం కాన్వాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నగరంలోకి వెళుతోంది. సీఎం కాన్వాయ్‌ను వేచిఉండాలని, గ్రీన్‌ కారిడార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తాము కోరామని అధికారులు తెలిపారు. పూణే ట్రాఫిక్‌ పోలీసులు చర్యను ప్రశంసిస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు. రోగి సకాలంలో గుండె మార్పిడి చికిత్సను పొంది సత్వరమే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Related posts