telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశం ఎటుపోతోంది దేవుడా.. అమ్మలు అమ్మాయిలే పెళ్లి చేసేసుకుంటూ…

indian culture drastically deviated

పాశ్చాత్య సంస్కృతిని మనవాళ్ళు చాలా చక్కగా పాటించడం నేర్చుకుంటున్నారు. ఒక ఆంగ్ల సంవత్సరాది నాడు గొప్పగా హడావుడి చేసిమరీ జరుపుకునే వీళ్లు, ఉగాది నాడు ఉదయాన్నే లేచి పూజలు చేసుకోమంటే మాత్రం నసుగుతారు… ఆ స్థాయికి వీళ్లకు పాశ్చాత్య సంస్కృతి అలవాటు అయిపోయింది, అది పాటించడం చాలా సులువు కాబట్టే దానిపై వ్యామోహం కూడా అలాగే పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఎక్కడ వరకు వెళ్లిందంటే ఒకే జాతి వాళ్ళు పెళ్లిళ్లు కూడా చేసేసుకుంటున్నారు. ఏమైనా అడిగితే, మేము మేజర్లం, మాకు తెలుసు మేము ఏమి చేస్తే మాకు సంతోషంగా ఉంటుందో.. అని; ఇంతవరకు అంటే వాళ్ళవరకు ఇది బాగానే ఉంటుంది, కానీ దేశ సంస్కృతికి సంబంధించింది కాబట్టి ఆ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి కానీ, సొంత జీవత పరిధిలో తీసుకోకూడదనేది వీళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుందో అప్పుడే మన సంస్కృతి మూడుపువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతుంది. లేదంటే సంస్కృతి చిహ్నాలు కూడా తరువాతి తరాలకు మ్యూజియం లో చూపించే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఆ ఇద్దరి మధ్య స్నేహం పెనవేసుకుపోయింది. అది ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా బలపడింది. ఆ విషయం గ్రహించిన వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

కాన్పూరుకు చెందిన ఇద్దరు యువతులు కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచీ స్నేహితులు. వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇంట్లో వాళ్లకు చెప్పడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇద్దరూ ఇంట్లోంచి వచ్చేసి వారణాసి జిల్లా విర్భన్‌పూర్‌లోని రొహానియా ప్రాంతానికి చేరుకున్నారు. గ్రామంలోని హనుమంతుడి ఆలయానికి చేరుకుని అక్కడి పూజారికి పరిస్థితి వివరించారు. తమకు పెళ్లి జరిపించాలని కోరారు. తొలుత వారి నిర్ణయం విని ఆశ్చర్యపోయిన పూజారి తర్వాత అంగీకరించాడు. గ్రామ పెద్దలను పిలిపించి మాట్లాడాడు. వారే పెళ్లి పెద్దలుగా నిలిచి ఇద్దరికీ ఘనంగా వివాహం జరిపించారు. ఈ పెళ్లికి గ్రామస్థులు పెద్ద ఎత్తున హాజరై యువతులు ఇద్దరినీ ఆశీర్వదించారు!

Related posts