telugu navyamedia
రాజకీయ

ఐదు రాష్ట్రాల్లో షెడ్యూల్ విడుద‌ల‌…- ఆంక్షలు ఇవే

దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదలైంది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ భవన్ లో శనివారం నాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.

403 సీట్లతో దేశంలో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న యూపీలో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు

యూపీలో ఫిబ్రవరి 10న మొదటి విడత, ఫిబ్రవరీ 14న రెండో విడత, ఫిబ్రవరీ 20న మూడో విడత, ఫిబ్రవరీ 23 నాలుగో విడత, ఫిబ్రవరీ 27న అయిదో విడత, మార్చి 3న ఆరో విడత పోలింగ్ మార్చి 7న ఏడో విడత జరగనుంది.

ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 14న మొదలై.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ముగియనుంది.

మణిపుర్‌లో రెండు విడతల్లో ఫిబ్రవరి 27, మార్చి 3న ఎన్నికలు జరగనున్నాయి. .ఐదు రాష్ట్రాల్లో మార్చి 7న ఓటింగ్‌ ముగుస్తుంది. మార్చి 10న కౌంటింగ్‌ జరుగుతుంది. 2017లో జనవరి 4న అసెంబ్లీ ఎన్నికల తేదీలను కమిషన్‌ ప్రకటించగా, ఈసారి 4 రోజుల ఆలస్యంగా అంటే జనవరి 8న కొత్త ఓటింగ్‌ తేదీని ప్రకటిస్తోంది.

మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి ఆన్‌లైన్‌ నామినేషన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చని తెలిపారు. దీని వల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్పారు.

ఎన్నికల కోడ్ అమలు- ప్రచారాలు బంద్..

కరోనా నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

జనవరి 15వరకు రోడ్‌ షోలపై నిషేదం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. పాదయాత్రలు, సైకిల్‌, బైక్‌ ర్యాలీలపై కూడా నిషేదం విధించారు.

జనవరి 15న కరోనా పరిస్థితిని అంచనా వేసి తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది.

కరోనా నిబంధనలు పాటించకపోతే.. జనవరి 15 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగించేందుకు ఈసీ వెనకాడదని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు.

 

Related posts