telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు తెలంగాణ హైకోర్టు కేటీఆర్ ఫార్ములా ఈ రేసు క్వాష్ పిటిషన్ కొట్టివేసింది

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగిందంటూ ఏసీబీ తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఉదయం తీర్పు వెలువరిస్తూ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.

ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే విదేశాలకు నిధులు తరలించారని కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రూ.55 కోట్లు చెల్లించాలంటూ కేటీఆర్ మౌఖికంగా ఆదేశించడంతో అప్పట్లో అధికారులు ఈమేరకు చెల్లింపులు జరిపారని ఏసీబీ కేసు నమోదు చేసింది.

Related posts