telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ‌ను అగ్ర‌శ్రేణి రాష్ట్రంగా నిల‌పాలి : కేటీఆర్

KTR TRS Telangana

తెలంగాణ‌ను భారత‌‌దేశంలోనే అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ని చేస్తున్నారు అని ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు బ్యాడ్మింట‌న్ కోర్టులు, లేడీస్ జిమ్‌, యోగా హాల్‌, స్నూక‌ర్ రూమ్‌, క్యార‌మ్స్, జెంట్స్ జిమ్, టేబుల్ టెన్నిస్ ఆడుకునేందుకు స‌దుపాయాల‌ను క‌ల్పించారు. సనత్ నగర్ నెహ్రూ పార్కులో థీమ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంత‌కుముందు బ‌ల్కంపేట‌లో రూ. 3.60 కోట్ల‌తో నిర్మించిన వైకుంఠ‌ధామాన్ని ప్రారంభించారు.

స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు తెలుసుకుని వాటిని తీర్చే వారే అస‌లైన నాయ‌కులు అని కేటీఆర్ అన్నారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని స్ప‌ష్టం చేశారు. రాష్ర్టం ఏర్ప‌డ్డ స‌మ‌యంలో అనేక అనుమానాలు ఉండేవి. అప్పుడు క‌రెంట్ ఉంటే వార్త‌.. నాడు నీళ్లు వ‌స్తే వార్త‌. అప్పుడు సుస్తీ ఎక్క‌డికి పోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో అలాంటి స‌మ‌స్య‌లు లేవు. 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ప్ర‌తి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. పేద‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఇలా హైద‌రాబాద్‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు.

తెలంగాణ‌ను భారత‌‌దేశంలోనే అగ్ర‌శ్రేణి రాష్ర్టంగా నిల‌పాల‌నే ఉద్దేశంతో సీఎం ప‌ని చేస్తున్నారు. రాష్ర్టం రెవెన్యూను పెంచాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని ఉద్ఘాటించారు. పేద‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాల రూపంలో ఆ ఆదాయాన్ని అందించాల‌న్న‌దే సీఎం ఉద్దేశం అని కేటీఆర్ తెలిపారు. పేద‌ల‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. క‌రోనా వైర‌స్‌, వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అర్హులైన‌ పేద‌ల‌కు త‌ప్ప‌కుండా డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను పంపిణీ చేస్తామ‌న్నారు. పేద‌వారికి స్థ‌లాలు ఉండి ప‌ట్టాలు రాని వారు ఉన్నారు. గ‌తంలో జీవో నం. 58, 59 కింద కొంత‌మందికి ఇచ్చాం. మిగ‌తా స‌మ‌స్య‌ల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Related posts