telugu navyamedia
సామాజిక

డ్యూటీ బియాండ్ డెత్.

 భారత్చైనాసరిహద్దుల్లో కాపాలాకాస్తున్నచనిపోయినభారతజవాను_ఆత్మ . ఆత్మని తీసుకెళ్లాలని భారత్‌కు లేఖ రాసిన చైనా ఆర్మీ అధికారులు. ఇది నిజం నమ్మలేని నిజం. మన దేశ సరిహద్దులో ఒక ఆత్మ దాదాపు 50 ఏళ్లగా కాపాల కాస్తుంది. మీ ఆత్మను మీరు తీసుకెళ్లండి అంటూ చైనా ఆర్మీ గగ్గోలు పెడుతుంది. ఆత్మలు లేవని మనం నిజంగా నమ్మితే చైనా సైనికులకు ఎలా కనిపిస్తొంది??

 సైనికుని ఆత్మకు మనఆర్మీ జీతం, సెలవులు, ప్రమోషన్లను వర్తింప జేస్తొంది అంటే నమ్ముతారా కానీ ఇది నమ్మలేని నిజం. ఒకసైనికుడు1967లో మరణించాడు, చనిపోయిన తర్వాత కూడా అతడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు. భారత్ – చైనా సరిహద్దుల్లో కాపాలాగా ఉన్నాడు.  ఇది కేవలం ఒక్కరి విశ్వాసమో కాదు, భారత సైనికుల నమ్మకం కూడా.

 సైనికుడు #హర్భజన్_సింగ్….  దేశ భక్తుడి ఆత్మ కథ ఇది. భారత్ – చైనా సరాహద్దుల్లో కథూవా మార్గంలో ఎతైన పర్వతాలలో సైనికులు కాపాల కాయడం చాలా కష్టమైన పని. చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తుం డడంతో మన సైనికులు రాత్రిపగలు కాపలా కాస్తుంటారు. మన సైనికుల సామర్ధ్యాన్ని ఎవరు శంకించరు కానీ సైనికుల మధ్యనే #కనిపించనిఓసైనికుడు కూడా  విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడ భయంకరమైన  మంచులో ఎక్కువ సమయం డ్యూటీ చేస్తూ కూడా జవానుకు కంటి మీద కునుకు రాదు ఒకవేళ పొరపాటున వస్తే వెంటనే చెంప చెల్లుమనిపిస్తాడు, నిద్ర లేపుతాడు. చైనా సైనికులు ఆక్రమనలకు ప్రయత్నిస్తే గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి వెంటనే హెచ్చరిస్తాడు. ఆయనే మన భారత సైనికుడు #బాబాహర్భజన్సింగ్….

1965లో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుజర్వాలా జిల్లా సంద్రాణాలో 1946 ఆగస్టు 30జన్మించారు, కానీ ఫోస్టింగ్ మాత్రం సిక్కింలో పడింది. భారత్ –చైనా సరిహద్దుల్లో ఉన్న నాథూలాలో విధులు నిర్వర్తిస్తున్నపుడు హర్భజన్  అనుకోకుండా మంచు తుఫాన్ లో చిక్కుకున్నాడు. సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాలనుంచి  కాలుజారి లోయలో పడ్డాడు.  1967 సెప్టెంబర్ 11మంచులో కూరుకుని ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అతన్ని వెతకడానికి సైనికులు చాలా ప్రత్నించారు, కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. ఒకరోజు రాత్రి తన సహచరుడి కలలో కనిపించాడు, తర్వాత అద్భుతం జరిగింది. ఎందుకంటే అంతవరకు ఎంత  వెతికినా దొరకని అతడి ఆచూకి సహచరుడికి కలలో కనిపించిన చోటు వెతికారు. ఆశ్చర్యంగా అతడు చెప్పిన చోటునే పార్ధివ దేహం దొరికింది, శవం పక్కనే రైఫిల్ కూడా లభించింది. ఖననం చేసిన తర్వాత అంతా ఆయన గురించి మరచి పోయారు. కొన్ని రోజుల తర్వాత మరో సహచరుడి కలలో కనిపించాడు.

నా శరీరం కాలి పోయింది కానీ నా ఆత్మ ఎప్పటికి డ్యూటీలోనే ఉంటుందని చెప్పారు. మొదట దాన్ని అందరు లైట్ తీసుకున్నారు. కానీ ఆతర్వాత తోటి సైనికులు అద్భుతం జరగడంచూశారు. ఏదైనా ఆపద రాబోతున్నా, శత్రువులు చొర బాటుకు ప్రయత్నించినా ముందుగానే తన సహచరుల కలలో కనిపించి హెచ్చరించేవాడు. #చైనా_ఆపరేషన్చేపట్టబోయే విషయాన్ని ముందుగానే హర్భజన్ సింగ్  కలలో కనిపించి చెప్పేవారు. ఆయన చెప్పింది తర్వాత అలాగే జరిగేది. ఈవిషయం క్రమంగా అధికారుల చెవిన పడింది, కానీ మొదట వాళ్లు దీన్ని నమ్మలేదు, పరిక్షించి చూసి ఆశ్చర్యపోయారు…. మీసైనికుడు తెల్లటి దుస్తులుధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని అతన్ని వెనక్కి పిలిపించుకోండి అని చైనా సైనికులు మన ఆర్మీకి చాలా సార్లు చెప్పారట. ఇక చైనా అధికారులు ఈవిషయంలో మన సైనిక అధికారులకు లేఖ కూడా రాశారంట. దీని గురించి బాబా హర్భజన్ సింగ్ మన సైనిక అధికారులకు ముందే కళలో కనిపించి చెప్పాడంట.

దీంతో అధికారులు కూడా హర్భజన్ ఆత్మపై విశ్వాసం ఏర్పడింది. మంచు తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ల మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని భావిస్తారు మన సైనికులు…. హర్భజన్ సింగ్ #బాబాహర్భజన్సింగ్ ఎలా అయ్యాడు…. సరిహద్దుల్లో కాపాల కాస్తున్న జవాను ఆత్మ బాబా హర్భజన్ సింగ్ పేరుపై ఒక మందిరం కూడా కట్టించారు మన సైనికులు… నాథూలా మార్గంలో 13వేల అడుగుల ఎత్తులో ఉంది ఈమందిరం. ఇక్కడ బాబా హర్భజన్ సింగే దైవం… ఆయనఫోటో,, యూనిఫాం,, షూతో పాటు పరుపు మరన్ని వస్తువులను ఇక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తారు….ఆమందిరం ఆలనా పాలనా ఆర్మీనే చూస్తొంది….  ఉదయం టిఫిన్ నుంచి రాత్రి బోజనం వరకు ఈమందిరంలో హర్భజన్ సింగ్ కు పెడతారు. చీకటి పడినవెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు. ఎందుకంటే బాబా రాత్రివేళ డ్యూటి పై వెళతారు అనేది వారి విశ్వాసం , బాబా హర్భజన్ సింగ్ డ్యూటిలో ఉన్న సైనికుడిగా భావిస్తారు. అందుకే ఒక సైనికుడికి వర్తించే నియమాలన్నీంటిని హర్భజన్ సింగ్ కు వర్తింప జేస్తారు.

వేతనం నుంచి సెలవులు, ప్రమోషన్ల వరకు ఆయనకు వర్తింప జేస్తారు, అదికూడా మరణాంతరం వర్తించడమే ఇక్కడ విశేషం…. బాబా హర్భజన్ సింగ్ సరిహద్దుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ మనదేశాన్ని కాపాడుతున్నాడు అనేది సైనికులతో పాటు ప్రజల విశ్వాసం. అందుకే భారత్-చైనా సరిహద్దుల్లో జరిగే ప్రతి సమావేశానికి ఆయన్ను కూడా భాగస్వామిని చేస్తారు మన సైనిక అధికారులు. ఆయన గౌరవార్ధం ఒక ఖాళీ కూర్చీలో ఫోటో పెడతారు, ఇలా చేయడం అనేది సైనికుల మూఢనమ్మకం కాదు, నియమాలను పాటించడం అంటారు అధికారులు. హర్భజన్ సింగ్  ఆర్మీలో ఉన్న రోజుల్లో ఎంత హడావిడి ఉండేదో ఇప్పుడు అలాగే ఉంటుంది.శారీరకంగా హర్భజన్ లేక పోయినా ఆయన ఆత్మ ఉందని భావిస్తున్నారు… భారత్-చైనా సరిహద్దుల్లోని నాథూలా మార్గంలో ఉష్టోగ్రతలు  ఎప్పుడు 0 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతుంది. మంచులో అప్పుడప్పుడు కాలు జారుతుంది.

శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ జీవించడం చాలా కష్టం. కానీ చైనా లాంటి శత్రుదేశం పన్నాగం నుంచి కాపాడ్డానికి కాపలా కాస్తారు. ఇలాంటి ప్రాంతంలో సైనికలు ప్రశాంతంగా ఉన్నారు అంటే అది సైనికుల ధైర్య  సాహసాలతో పాటు బాబా హర్భజన్ సింగ్ అండగా ఉండడమే అని భావిస్తారు. బాబా కష్ట కాలంలో ఆదుకుంటారన్నది సైనికుల నమ్మకం. అది క్రమంగా జనాల్లోకి వెళ్లింది.  దీంతో సామాన్య జనంకూడా ఆయన దర్శనానికి బారులు తీరుతున్నారు. సందర్శకుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని మరింతగా విస్తరించి అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఆర్మీ.

ఈమందిరాన్ని సందర్శించే వారు లోపల నోట్ పుస్తకాన్ని ఉంచుతారు, అందులో సందర్శకులు తమ కోర్కెలను రాస్తారు, బాబా హర్భజన్ సింగ్ డ్యూటి నుంచి తిరిగి వచ్చి రాసి ఉన్న కొర్కెలను చదువుతారని తర్వాత వాటిని తీరుస్తాడని వారి నమ్మకం. ఇక్కడ ప్రజలు నీటి బాటిల్స్ ని కూడా సమర్పిస్తారు, ఎవరికైనా అనారో గ్యంగా ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా మూడు రోజుల తర్వాత ఆబాటిల్స్ ని తీసుకుని వెళతారు. అందులోని నీటిని 21 రోజుల పాటు కొంచెం కొంచెం త్రాగితే సమస్యలన్నీ మటుమాయం అవుతాయనేది ప్రజల నమ్మకం,ఇంకా సైనికులకు ఈమందిరం శక్తి స్వరూపంతో సమానం. కొత్తగా ఆర్మీలో చేరిన జవాన్లుఈమందిరానికి వచ్చి నమస్కరించి విధుల్లో చేరడం ఆనవాయితీ.

హర్భజన్ సింగ్ కు ప్రతి సంవత్సరంసెప్టెంబర్ 15ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ. సెప్టెంబర్ నెలలో రెండు నెలల సెలవులపై తన  సొంతూరు పుంకా గావులోని తన ఇంటికి వచ్చేవారు. అప్పుడు ఊరు ఊరంత ఆయనకు స్వాగతం పలక డానికి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చేవారు సైనికులుకూడా అక్కడికి వచ్చి ఘనస్వాగతం పలికే వారు, ఇప్పుడు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు…. ఎటా సెప్టెంబర్ 15 రైల్లో సీటును రిజర్వు చేస్తారు దానిపై హర్భజన్ ఫోటో, వస్తువులు ఉంచుతారు.

సొంత గ్రామానికి రైలు రాగానే జవాన్లు, జనం ఆయన ఫోటోకి స్వాగతం పలుకుతారు. చనిపోయి కూడా ఆత్మ విధులు నిర్వర్తిస్తుందని భావించి హర్భజన్ సింగ్ కు ఇచ్చే  అత్యంత అరుదైన గౌరవం ఇది. ఆయన మరణించి 50 ఏళ్లు కావస్తొంది. ఇప్పటికూడా ఆయన ఆత్మ రూపంలో భారత్-చైనా సరిహద్దుల్లో విధులునిర్వహిస్తున్నట్టు సైనికులు నమ్ముతారు. ఇదేమి మూఢ నమ్మకం కాదని తమకు ఎదురౌతున్న అనుభవాలదృష్ట్యా నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి అంటారు సైనికులు, అందుకే శరీరం లేని జవాను బ్రతికున్నట్లుగాభావిస్తారు…. జైజవాన్ జైహింద్ !!

Related posts