telugu navyamedia
సామాజిక

జీవితం ప్రయాణమా లేక పరుగు పందెమా ?

జీవితాన్ని ఒక పందెంగా తీసుకుంటేనే గెలుపు ఎవరిది అనే ప్రశ్న వస్తుంది.

పందెం అనే మాట వచ్చినప్పుడే సాపేక్షకత వస్తుంది. పోలిక మొదలవుతుంది. అప్పుడే గెలుపా ఓటమా అన్న ప్రశ్న, దానికి సంబంధించిన ఆనందం, బాధ అన్నీ వస్తాయి.

కానీ జీవితం ఒక ప్రయాణం మాత్రమే. పందెం కాదు. ఎవ్వరితోను పోల్చుకోవాల్సిన అవసరం లేదు.

మనకి తిరుపతి వెళ్ళాలి అని ఉంది అనుకోండి. మన సొంత విమానంలో, హెలీకాప్టర్ లో, మనకోసం మాత్రమే అద్దెకు తెచ్చుకున్న విమానంలో, రైలుబండిలో, బస్సులో, కారులో, ఎడ్ల బండిలో, కాలి నడకన ఇలా ఎలాగైనా వెళ్ళచ్చు. (ఇంకా చాలా ప్రయాణ సాధనాలు ఉంటాయి. అన్ని చెప్పలేదు).
అక్కడకు చేరుకున్న ప్రతివాడు గెలిచినట్టే. ఆనందపడవచ్చు. జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ ఎప్పుడైతే పోలిక మొదలవుతుందో అప్పుడే ఇబ్బంది మొదలవుతుంది.

జీవితాన్ని ప్రయాణంగా కాకుండా పందెంగా భావించిన రోజున మనం జీవితంలో ఆనందం కోల్పోతాం.
మన దగ్గర ఉన్న వస్తువలకు విషయాలకు విలువ ఇవ్వకుండా ప్రక్కవాడి వస్తువులు, విషయాల గూర్చి కోరిక మొదలైంది అంటే నువ్వు పరుగు పందెంలో ప్రవేశించావన్నమాటే. నీ అశాంతిని నువ్వే కొని తెచ్చుకున్నావన్నమాటే.

Related posts