telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో తెరుచుకున్న పర్యాటక కేంద్రాలు!

Boating Husain sagar

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణలో పర్యాటక కేంద్రాలు నిన్న తెరుచుకున్నాయి. హైదరాబాద్‌లోని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు తెరుచుకున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు మళ్లీ విహార యాత్రలకు సిద్దమవుతున్నారు. దీంతో హైదరాబాద్ వాసులు ఉత్సాహంగా పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారు.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ ప్రారంభమైంది. పర్యాటక శాఖ బస్సులకు బుకింగ్ కూడా ప్రారంభమైంది. శిల్పారామం నేడు తెరుచుకోనుంది. ఆరు నెలల తర్వాత హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ ప్రారంభం కావడంతో సందర్శకులు బోటింగ్‌కు ఎగబడ్డారు. పర్యాటక ప్రదేశాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలను తిరిగి తెరుస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Related posts