telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

ఓ మహిళా…వందనం !

latangi poetry corner

కోడికూత కన్నా ముందుగా లేచి
కాలమానంతో పోటీ పడుతూ
కుటుంబం విధులు నిర్వర్తిస్తూ
నిత్యం ప్రమిదిలా వెలుగునిచ్చే
ఓ మహిళా…నీకు వందనం

పురిటినొప్పులతో పునర్జన్మనెత్తి
ఎందరో మహనీయులకు జన్మనిచ్చి
భారతావని నుదుటన వీరతిలకం దిద్ధి
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన
ఓ వీరనారీ…నీకు వందనం

అమ్మగా అందరికి ప్రాణంపోసి
అర్థాంగిగా జీవితానికి అర్థంచెప్పి
సోదరిగా ప్రేమాభిమానం పెంచి
బహుముఖపాత్రలో మాకైనిలిచిన
ఓ స్త్రీ మూర్తీ…నీకు వందనం

సభ్య సమాజం నీపట్ల
చిన్నచూపు చూసినా
పెద్దమనసుతో నీవు పెట్టే
క్షమాభిక్ష గుణానికి
వందనం…అభివందనం

నీ ఉనికి లేనిదే సృష్టేలేదు
అంతా నీవై, అన్నింటా నీవై
మా పురోభివృద్దికి శ్రమించి
ఈ ప్రపంచాన్ని నడిపించే నీకు
ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి ?
మరు జన్మ ఉంటే…మరణించి
మరలా నీ కడుపున
జన్మించడం తప్ప….!

——–కయ్యూరు బాలసుబ్రమణ్యం
శ్రీకాళహస్తి….

Related posts