telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

శామ్‌సంగ్‌ చైర్మన్‌ లీకున్‌ మృతి..

గ్లోబల్ టెక్ టైకూన్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ లీ కున్-హీ ఇవాళ మృతి చెందారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ పేర్కొంది. లీ నాయకత్వంలో, శామ్‌సంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్, మెమరీ చిప్ ల ఉత్పత్తిదారుగా ఎదిగింది. అంతేకాదు శామ్‌సంగ్ సంస్థ యెక్క మొత్తం టర్నోవర్ నేడు దక్షిణ కొరియా యెక్క జీడీపీలో ఐదో వంతుకు సమానంగా ఉంది. లీ కొరియాలోని డేగులో 1942 జనవరి 9 న జన్మించాడు. శామ్‌సంగ్ వ్యవస్థాపకుడైన ఆయన తండ్రి లీ బైంగ్ చుల్ మరణం అనంతరం లీ శామ్‌సంగ్ బాధ్యతలను చేపట్టారు. కాగా లీకి 2014 లో తొలిసారి గుండె పోటు వచ్చింది. అప్పటినుంచి ఆయన హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. గొప్ప మనిషిని పోగొట్టుకున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లకు ఎంత చేసిన తక్కువే అని అంటున్నారు. 

Related posts