telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. 24 గంటల్లో 66,999 కేసులు

corona vairus

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో 66,999 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో 942 మంది మృతి చెందారని తెలిపింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,96,638కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 47,033 కి పెరిగింది. 6,53,622 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 16,95,982 మంది కోలుకున్నారు.

దేశవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 2,68,45,688 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 8,30,391 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.

Related posts