telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న దుల్కర్ సల్మాన్ “కురుప్” టీజర్

Kurup

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా వెండితెరకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ వరుస సినిమాలతో మంచి జోష్ మీదున్నాడు. “మహానటి” సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి గుర్తింపును, క్రేజ్ ను సంపాదించుకున్నాడు. నేడు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ”కురుప్” టీజర్ రిలీజ్ చేసారు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన సుకుమార కురుప్ అనే క్రిమినల్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించబడింది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు. ఈ చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంచి ఆదరణ తెచ్చుకోగా ఇప్పుడు టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts