telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పవర్ స్టార్” సరసన రకుల్ ?

rakul

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. మరోవైపు డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమా కూడా ప్రస్తుతం పవన్ చేతిలో ఉంది. ఏఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరియు ప్రజ్ఞా జైస్వాల్ లు హీరోయిన్ గా నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన రకుల్ కూడా నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.ఇటీవల డైరెక్టర్ క్రిష్ రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే క్రిష్ పవర్ స్టార్ మూవీ కోసం అడిగారా లేదా మరేదైనా ప్రాజెక్ట్ కోసం అమ్మడిని అడిగారా అనేది తెలియాల్సి ఉంది.

Related posts