telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్‌ కేసు: అక్టోబర్‌ 3 వరకూ రేమండ్ లో క్షితిజ్‌ రవి ప్రసాద్‌

Kshij

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ కోసం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ శనివారం ప్రశ్నించింది. మరోవైపు.. కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్‌ విధించింది. మరింత సమాచారం రాబట్టేందుకు, ఇప్పటి వరకూ వెల్లడించిన విషయాలను నిర్ధారించుకోవడానికి కస్టడీని పొడిగించాలంటూ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కోరింది. అందుకు కోర్టు అక్టోబర్‌ 3 వరకూ అనుమతి ఇచ్చింది. అయితే శనివారం ఎన్‌సీబీ అధి​కారులు నిర్మాత ప్రసాద్‌ను శనివారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతడిని విచారించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్‌సీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఇటీవల పట్టుకున్న డ్రగ్స్‌ కేసులో నిందితుడైన అనుజ్‌ కేశ్వానితో ప్రసాద్‌కు పరోక్షంగా సంబంధం ఉందని ఎన్‌సీబీకి చెప్పడంతో ఆయనకు కస్టడీ తప్పలేదు. నటుడు సుశాంత్‌ మరణంతో సంబంధం ఉన్న నిందితులతో కూడా ప్రసాద్‌కు డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. ప్రసాద్‌ గతంలో సినీ నిర్మాత కరణ్‌ జోహార్‌ వద్ద పని చేశారు. అయితే ప్రసాద్‌ నుంచి స్టేట్‌మెంట్‌ కోసం అధికారులు వేధించారని, బ్లాక్‌మెయిల్‌ చేశారని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ప్రసాద్‌ లాయర్‌ సతీష్‌ మనెషిండె కోర్టుకు తెలిపారు.

Related posts