telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు

Kangana

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై, డ్రగ్స్ వ్యవహారంపై కంగనా సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు తీరుపై, మరోవైపు బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు చేస్తూ కంగనా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అయితే ఇటీవల కంగనా ఆఫీసు అక్రమ కట్టడమంటూ బీఎంసీన (బృహన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు గోడలను కూల్చేశారు. దీనిపై కంగనా ఏకంగా ముంబై హైకోర్టులో కేసు వేసింది. తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారం చెల్లించేలా చూడాలని కంగనా కోరారు. అనంతరం మహా గవర్నర్ తో భేటీ అయ్యింది. ఆ తరవాత కంగన వరుస ట్వీట్ లతో రెచ్చిపోతుంది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే వివాదాస్పదమైన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులపై క్వీన్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ పై కర్ణాటకలోని తుమ్కూర్ జెఎంఎఫ్.సి కోర్టులో క్రిమినల్ కేసు నమోదైంది. దీనిలో ఆమె నిరసనకారులను ‘ఉగ్రవాదులు’ అంటూ అభివర్ణించింది. దాంతో ఆమెపై ఐపిసి సెక్షన్ 44.. 108.. 153.. 153 ఎ, 504 కింద కేసు నమోదైంది. ఇక అధికార భాజపా ఎన్డీయేకి కంగనా వత్తాసు పలకడంపైనా చాలామంది సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు ప్రతిపక్ష నాయకులను ఉగ్రవాదులతో పోల్చడంతో ఒక్కసారిగా కంగనా పై మండిపడుతున్నారు.

Related posts