telugu navyamedia
రాజకీయ వార్తలు

కొత్త వెబ్ సైట్ ప్రారంభించనున్న ట్రంప్… ఎందుకంటే..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ పోటీ చేసి విజయం సాధించారు.  అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్, అయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి.  యూఎస్ క్యాపిటల్ పై దాడి చేసిన వారిని ప్యాట్రియాట్స్ అని సంబోధిస్తూ ట్వీట్ చేయడంతో ట్రంప్ ట్విట్టర్ ను తొలగించింది ట్విట్టర్.  అటు పేస్ బుక్ కూడా ట్రంప్ అకౌంట్ ను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు ట్రంప్ సరికొత్త సోషల్ మీడియా వేదికగా ముందుకు రాబోతున్నారు.  అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అభివృద్ధి, మంచి పనులు తదితర విషయాలను తెలియజేసేందుకు 45office.com పేరుతో ఓ వెబ్ సైట్ ను తీసుకొచ్చారు.  దీనిని త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు.  ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా ట్రంప్ మరోసారి ప్రజల్లోకి రావాలని చూస్తున్నారు.  2024 లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు పని చేస్తుంది అనేది.

Related posts