telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు రాహుల్ జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన మోదీ

Rahul gandhi Modi

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని.. ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.

ఇక తమ అధ్యక్షుడి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రజల్లో రాహుల్ స్ఫూర్తి నింపిన ఐదు ఘటనలంటూ ఈ వీడియోను పోస్టు చేసింది. మరోవైపు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు ట్విట్టర్‌ ద్వారా రాహుల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులను పెడుతున్నారు.

Related posts