telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీ నేత దివ్యవాణి రాజీనామాపై ట్విస్ట్‌..

టీడీపీకి అధికార ప్రతినిధి, సినీ న‌టి దివ్యవాణి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది .మహానాడుతనకు అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు.

తాజాగా నేడు ఆమె ట్విట్టర్ అకౌంట్‌లో రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే కొద్దిసేపటికే దివ్యవాణి ఆ ట్వీట్ డిలీట్ చేశారు.  అయితే ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఇన్ స్టా అకౌంట్‌లో ఉంచారు. తర్వాత ఇన్‌స్టా అకౌంట్ నుంచి కూడా ఆ పోస్ట్‌ను తొలగించారు. దీంతో ఆమె రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా..పార్టీలో తనకు ఉన్న సమస్యలపై చంద్రబాబు, లోకేష్‌లతో మాట్లాడతానని ప్రకటించారు.  దీంతో ఆమె రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది

మహానాడులోనూ దివ్యవాణి  పాల్గొన్నారు.  అయితే మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. మహానాడు అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది. 

మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింద‌ని.. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేద‌ని అన్నారు. దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు. ఒక క‌ళాకారుడు పెట్టిన పార్టీలో నాలాంటి క‌ళాకారుల‌కు స్థానం లేక‌పోవ‌డం న‌న్ను తీవ్ర ఆవేద‌న‌కు గురి చేస్తోంది.

పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను’ అని దివ్యవాణి చెప్పారు. అంతటితో ఆగని ఆమె వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. 

 

Related posts