telugu navyamedia
సినిమా వార్తలు

‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్..

బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీబడ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’.

ఇందులో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు.  

ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Brahmastra

సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా రణ్‌బీర్‌ మంగళవారం వైజాగ్‌లో గ్రాండ్ వేలో సందడి చేశాడు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌ను, ఇందులోని కొన్ని పాత్ర‌ల‌కు సంబంధించిన లిటిల్ బిట్స్‌ను ఆడియెన్స్‌కోసం ప్ర‌ద‌ర్శించారు.

ఈ సందర్భంగా రణ్‌బీర్‌కు గజమాలతో అభిమానులు ఘనస్వాగతం పలికారు. క్రేన్ సాయంతో ఆయనకు భారీ పూలమాల వేసి అభిమానులు సత్కరించారు. ఇక రణ్‌బీర్‌ కూడా ఫ్యాన్స్‌కు అభివాదం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.

Ranbir Kapoor & SS Rajamouli Visit Visakhapatnam to Promote 'Brahmastra Part 1'

ఈ వైజాగ్‌ పర్యటనలో రణ్‌బీర్‌తో పాటు డైరెక్టర్‌ ఆయాన్‌ ముఖర్జీ కూడా ఉన్నారు. ఈ ప్రమోషన్‌ కార్యక్రమాలకు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమైళి అతిథిగా వచ్చారు. బ్రహ్మస్త్ర మూవీ టీంతో కలిసి ఆయన కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు.ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేస్తున్నట్టు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వేదిక‌పై నుండి ర‌ణ‌బీర్ క‌పూర్‌, అయాన్‌, రాజ‌మౌళి తెలిపారు.

Related posts