telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

మరో అల్పపీడనం సిద్ధం.. జులై మొదటివారంలో తుఫాన్..

another cyclone ready by july

హైదరాబాద్‌ వాతావరణ హెచ్చరికల కేంద్రం ఈ నెల 30న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపాన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు.

దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఓ మోస్తరుగా, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం జూలై తొలి వారంలో కనిపిస్తుందని వెల్లడించారు.

Related posts