telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30కి త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్ ?

Trivikram

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశారని తెలుస్తుంది. కాగా ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ భారీగా తీసుకుంటున్నారని టాక్. ఏకంగా 20 కోట్లకు తన పారితోషికం పెంచేశాడనే మాట వినిపిస్తుంది. ఒకప్పుడు 10-15 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న త్రివిక్రమ్ 20 కోట్లకు పెంచేశాడంటే మాములు విషయం కాదు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఉన్న త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీతో మరో మెట్టు పైకి వెళ్లారు. ఆయన మొదటిసారి అల వైకుంఠపురంలో మూవీతో 200 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరారు. అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

Related posts