telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పోలవరానికి నిధులు విడుదల.. 3వేలకోట్లు.. : కేంద్ర జలవనరుల శాఖ

3000cr funds released to polavaram soon

ఏపీకి జీవనాడిగా పిలుచుకునే పోలవరం పనులు ఇప్పటి వరకు 70శాతం మేరకు పనులు పూర్తైయ్యాయి. ఎన్నో అడ్డంకుల మధ్య రాష్ర్టంలో ఏర్పటైన తెలుగుదేశం ప్రభుత్వం పోలవరం పూర్తికి చాలా కృషి చేసింది. పోలవరంకు జాతీయ హోద తెచ్చెందుకు ఎన్నో విధాలుగా చంద్రబాబు శ్రమించారు. పలు జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. తెలుగుదేశం హాయంలో సరిగ్గా నిధులు ఇవ్వకపోయినా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,000 కోట్లు విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ నిధులను ‘నాబార్డు’ ద్వారా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. మరో రూ.1,810.04 కోట్ల మంజూరుపై కసరత్తు చేస్తోంది. నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను(యూసీలు) ఎప్పటికప్పుడు పంపిస్తే, ప్రాజెక్టుకు వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గత ఏడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల వనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. 2014 ఏప్రిల్‌ 1వ తేదీకి ముందు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన నిధులపై ఆడిట్‌ చేయించి, ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.

Related posts