telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీలో మరో విషాదం.. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే మృతి

TDP-flag

తెలుగుదేశం పార్టీ లో మరో విషాదం నెలకొంది. టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న సత్యప్రభ బెంగుళూరు వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబర్‌ 21న జన్మించారు.  ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదికేశవులు నాయుడు మృతితో సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ తరఫున విజయం సాధించారు. అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా.. ఇటీవలే సత్యప్రభ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

Related posts