తెలుగులో భారీ విజయాన్ని సాధించిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో తొలుత ఈ చిత్రాన్ని బాల దర్శకత్వంలో రీమేక్ చేశారు. “వర్మ” అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఔట్‌పుట్ అనుకున్నంత బాగా రాకపోవడంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేసి, సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. “ఆదిత్యవర్మ” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఇటీవల విడుదల చేయగా… సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. అయితే తాజాగా నిర్మాతలు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలా దర్శకత్వంలో తెరకెక్కిన వర్షన్ `వర్మ` సినిమాను ఇప్పుడు ఆన్‌లైన్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట. డైరెక్టర్ బాలా క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి వర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
previous post
next post


రాహుల్ అలా చేసి ఉండకూడదు… పబ్ దాడిపై యాంకర్ వ్యాఖ్యలు