telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ ను మోయడానికి ముప్పతుప్పలు పడ్డ హీరో… వీడియో వైరల్

Dream

“Dreaming Back to the Qing Dynasty” సినిమాలో ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో లి ల్యాండీ, జిన్ యున్లాయ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో లి.. హీరోయిన్ జిన్‌ను మోసుకుంటూ నడవాలి. అయితే, అతడు ఆమెను ఎత్తుకోడానికి ముప్పుతిప్పలు పడ్డాడు. ఆమె లావుగా, బరువు ఎక్కువగా ఉండటం వల్ల అతడు చాలా కష్టంగా మోశాడు. దీంతో షూటింగ్ స్పాట్‌లో నవ్వులు విరిశాయి. చేసేది ఏమీలేక.. షూటింగ్ సిబ్బంది ఆమెను నిచ్చెనపై కుర్చోబెట్టి, హీరో మోసుకుంటూ వెళ్తున్నట్లుగా క్లోజప్‌ షాట్లు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోను కొందరు చైనా సోషల్ మీడియా సైటు ‘విబో’లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను ‘సరదా’గా చూడాల్సిన జనం.. హీరోయిన్‌పై బాడీ షేమింగ్‌కు పాల్పడటం విచారకరం. లావుగా ఉన్నావంటూ ఆమెను హేళన చేస్తున్నారు.

Related posts