telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫిలిం ఛాంబర్ ముందు హీరో ఆత్మహత్యాయత్నం

Crime

‘నానిగాడు’ సినిమా విడుదల కాకుండానే యూట్యూబ్ లో ప్రత్యేక్షమైంది. దీంతో ఈ సినిమా హీరో దుర్గా ప్రసాద్ ఈ రోజు ఉదయం నిరసనకు దిగాడు. ఆయన మాట్లాడుతూ… అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ రెడీ అవుతోన్న నాని గాడి సినిమాను ఎవరో కావాలనే యూట్యూబ్‌లో ఉంచారని ఆరోపించాడు. అందులో భాగంగా దుర్గాప్ర‌సాద్ ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద తన నిర‌స‌నను వ్య‌క్తం చేసాడు. తాను 40 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా చేసానని, సినిమా సెన్సార్ కూడా పూర్త‌యిందని, ఇంతలో కావాలనే తమపై కక్ష్య గట్టి విడుద‌ల‌కు రెడీ అవుతోన్న స‌మ‌యంలో మొత్తం సినిమాను యూ ట్యూబ్ లో పెట్టేసారని ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాం అని పేర్కోన్నాడు. అంతేకాదు ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని లేకుంటే ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిన అతను.. ఫిలిం చాంబర్ ముందు పురుగుల మందు తాగాడు. అయితే ఈ విషయంపై అప్రమత్తమైన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో దుర్గా ప్రసాద్‌ను ఆసుపత్రికి తరలించారు.

Related posts