telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

హైదరాబాద్ : .. క్రెడారు సంస్థ .. ప్రాపర్టీ షో..

credai property show in hyd on 9th november

నవంబర్‌ 9, 10 తేదిల్లో క్రెడారు హైదరాబాద్‌ ప్రాపర్టీ షో (ఈస్ట్‌) 2019ను నిర్వహించనుంది. రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లతో కూడిన సంస్థ కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడారు). నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రెడారు అధ్యక్షులు రామకృష్ణరావు, జనరల్‌ సెక్రటరీ రాజ్‌ శేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగనున్న ఈ ప్రదర్శనలో 60 మంది డెవలపర్లు తమ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారన్నారు. అదే విధంగా బ్యాంకర్లు, బిల్డింగ్‌ మెటీరియల్‌దారులు, కన్సల్టెంట్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. బడ్జెట్‌కు తగిన రీతిలో డెవలపర్లు 5వేలకు పైగా యూనిట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు నగరంలోని పశ్చిమ ప్రాంతం అధికంగా అభివృద్ధిని నమోదు చేసిందన్నారు. ఒక వైపే నగరం పెరగడం వల్ల దీర్ఘకాలం ప్రయోజనం ఉండదన్నారు. ఇప్పుడు కొనుగోలుదారులంతా తూర్పు వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. గడిచిన కొన్ని త్రైమాసికాలుగా హైదరాబాద్‌ రియాల్టీ మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుందన్నారు. ఇతర మెట్రో నగరాలతో పోల్చితే ఇక్కడ ఇంకా తక్కువ ధరలే పలుకుతున్నాయన్నారు. ఈ సమావేశంలో క్రెడారు ఉపాధ్యక్షులు సి మురళీ మోహన్‌, రాజేశ్వర్‌, వేణు వినోద్‌, ఎన్‌ జైదీప్‌ రెడ్డి, ట్రెజరర్‌ ఆదిత్య గౌర, జాయింట్‌ సెక్రటరీలు శివ్‌ రాజ్‌ ఠాకూర్‌, రాంబాబు, క్రెడారు హైదరాబాద్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related posts