telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణాలో.. కులాంతర వివాహం చేసుకుంటే.. 2.5 లక్షల బహుమతి..

Marriages

రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహం చేసుకున్న జంటలకు అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాన్ని రూ.50 వేల నుంచి రూ.2.50 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజీలను ప్రోత్సహించడంతోపాటు అలా పెళ్లి చేసుకున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆర్థిక సాయాన్ని పెంచుతూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ గతంలో నిర్ణయం తీసుకుంది.

ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించనున్నాయి. ఎస్సీయేతర కులాలవారిని పెళ్లి చేసుకున్న ఎస్సీ యువకుడు లేదా యువతికి ఈ పథకం వర్తిస్తుంది. మంజూరైన సాయాన్ని పెళ్లయిన జంటల పేరిట మూడేళ్లకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయనున్నారు. ఆ తర్వాతే వారు డబ్బులు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Related posts