రాజేంద్రనగర్ డాక్టర్ హుస్సేన్ కేసులో సీపీ సజ్జనార్ సంచలన విషయాలను బయటపెట్టారు. హుస్సేన్ భార్యకు దగ్గరి బంధువు కిడ్నాపర్ ముస్తఫా అని..ఆస్ట్రేలియాలో ముస్తఫా ఆర్థికంగా పీకల్లోతు కూరుకుపోయాడన్నారు సీపీ సజ్జనార్. ఈ క్రమంలో హైదరాబాద్, పూణెలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడని..ఇతనికి ముబాషిర్ అహ్మద్ పార్టనర్ గా కలిశాడని పేర్కొన్నారు. ఇద్దరు విలాసవంతమైన జీవితానికి అలవాటు అయ్యారని..ఇందులో భాగంగా ఎవరైనా బాగా డబ్బు ఉన్న వ్యక్తి నుంచి కిడ్నాప్ చేయాలనుకున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా డాక్టర్ హుస్సేన్ ను ఎంచుకున్నారని..నెమ్మదిగా డాక్టర్ హుస్సేన్ తో పరిచయం పెంచుకున్నారని తెలిపారు. కొత్తగా నిర్మించిన భవనంలో కింద డాక్టర్ హుస్సేన్ క్లీనిక్ ను పెట్టాడని..ఇదే భవనంలో మొదట్లో అంతస్తులో ముస్తఫా ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడన్నారు.
అలా అతని పై నిఘా పెట్టడానికి తనకు చెందిన వ్యక్తులను అక్కడ ఉంచాడని..ప్లాన్ లో భాగంగా నిన్న మధ్యాహ్నం లైటర్ తుపాకీతో బెదిరించి డాక్టర్ కు చెందిన కారులోనే కిడ్నాప్ చేశారని వెల్లడించారు. కిడ్నాప్ ఒక టీమ్ చేస్తే మరో టీమ్ డాక్టర్ ను కర్ణాటకకు తీసుకెళ్ళాలని అనుకున్నారని తెలిపారు. చిన్న క్లూతో కిడ్నాప్ కు సంబంధించిన నిందితుల సమాచారం అందిందని..అనంతపురం జిల్లా పోలీసులు బాగా సహకరించారన్నారు. వారి సహకారంతో 13 గంటల్లో నే కిడ్నాప్ ను చేధించామని…క్లినిక్ నుండి కిడ్నాప్ చేసిన డాక్టర్ ను కూకట్ పల్లి కి తరలించారని చెప్పారు. కూకట్ పల్లి నుండి బెంగుళూరు కు డాక్టర్ ను తరలించేందుకు మరో టీమ్ ను రెడీ చేసుకున్న నిందితులు…సుమిత్ ,అక్షయ్, విక్కీ , సల్మాన్ లు క్లినిక్ లో ఉన్న హుస్సేన్ ను భూర్ఖా ధరించి దాడి చేసి కిడ్నాప్ చేశారన్నారు. డాక్టర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి 48 గంటల లోపు 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు. మొత్తం 12 టీమ్ లు రంగం లో కి దిగి 12 గంటల్లో సెన్షషనల్ కిడ్నాప్ కేస్ ను ట్రేస్ చేశామన్నారు సీపీ సజ్జనార్. ముస్తఫా, ఖలీద్ లు ఇద్దరు ఫైనాన్షియల్ సలహాదారులుగా పని చేస్తున్నారని.. అందుకోసమే బిట్ కాయిన్ రూపంలో డబ్బులు డిమాండ్ చేశారన్నారు.
previous post