telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టెన్నిస్ ప్లేయర్ సానియా ఫామ్ హౌస్ వద్ద కాల్పుల కలకలం…

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. దామగుండంలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అలాగే ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయని ఆ ఫామ్ హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపిస్తున్నారు.  ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ నిర్వాహకులు తమను బెదిరిస్తున్నారు అని స్థానికులు ఫిర్యాదు చేసారు. దీంతో ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ఈ విచారణలో కల్పిలా ఘ్తన పై కీలక సమాచారం సేకరించారు. స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందో దర్యాప్తు చేస్తున్నారు. ఆవు బుల్లెట్ గాయాల ఘ్తన తర్వాత ఫామ్ హౌజ్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. కొద్ది రోజులుగా ఫామ్ హౌజ్ ల పరిసరాల్లో పశువులను మేతకు తీసుకురావొద్దని గ్రామస్థులను  ఫామ్ హౌజ్ నిర్వాహకులు  హెచ్చరించారు. అందువల్ల ఆ ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు.

Related posts