telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎయిర్‌పోర్టులో లగేజ్ ఫీజు ఎలా తగ్గించాడో చూడండి.. వీడియో వైరల్

Man wears all 15 shirts after suitcase is over weight limit at airport

ఎయిర్‌పోర్టులో లగేజ్ ఫీజును తగ్గించేందుకు, లగేజ్ బరువును తగ్గించేందుకు జాన్ ఇర్విన్ అనే వ్యక్తి దాదాపు 8 కేజీల బరువు గల టీషర్ట్‌లు, షర్ట్‌లను ఒకదానిపై మరొకటి ధరించాడు. అలా మొత్తంగా 15 దుస్తులను వేసుకున్నాడు. ఈ మొత్తాన్ని జాన్ కొడుకు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అయిపోయింది. ఎయిర్‌పోర్టు సిబ్బందికి అదనంగా 96 పౌండ్లు(రూ.8200) చెల్లించాల్సి వస్తోందని జాన్ ఇర్విన్ ఇలా చేశాడని, తన తండ్రి ఎప్పుడూ కామెడీగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడని జాన్ కొడుకు చెబుతున్నాడు. జాన్ తన ట్విటర్ ఖాతాలోనూ ఈ వీడియోను పోస్ట్ చేయగా… ఈ వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో జాన్ ఇర్విన్ అనే వ్యక్తికి సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఫ్రాన్స్‌లోని నైస్ ఎయిర్‌పోర్టులో ఈ వెరైటీ సంఘటన చోటుచేసుకుంది.

Related posts