కరోనా పోరుకు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్ 30 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరికి ఇస్తున్నదీ వెల్లడించలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మాత్రం స్పష్టం చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తాము ఇప్పటికే ఫేస్‌మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశామని వెల్లడించింది.
కరోనా విధుల్లో ఉన్న వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ)లు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, విద్యా షా నేతృత్వంలోని ఎడెల్‌గివ్ ఫౌండేషన్ కూడా జూన్ త్రైమాసికంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ. 10 కోట్లు ఖర్చు చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.