telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పిల్లో ఛాలెంజ్… కేక పెట్టిస్తున్నపాయల్

payal

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఈ లాక్‌డౌన్ సమయంలో పలు రకాల టిక్ టాక్ వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ‘పిల్లో ఛాలెంజ్’ విపరీతంగా వైరల్ అవుతోంది. రెండు పెద్ద పిల్లోలను తీసుకొని వాటిని షార్ట్ డ్రెస్ మాదిరిగా శరీరానికి ముందు, వెనుక పెట్టుకుని నడుం వద్ద ఒక తాడుతో బెల్ట్ మాదిరిగా కట్టుకోవడమే ఈ ఛాలెంజ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ ఛాలెంజ్‌ను హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రయత్నించింది. పసుపు రంగు తలగడను తన శరీరానికి కట్టుకుని పిల్లో ఛాలెంజ్‌ను చేసి చూపించింది పాయల్. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. పాయల్‌కు ఇంట్లో బాగా బోర్ కొట్టేస్తుందట.. అందుకే, ఈ పిల్లో ఛాలంజ్‌ను ప్రయత్నించానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొంది పాయల్. మొత్తానికి ఈ పిల్లో డ్రెస్‌లో భలే సెక్సీగా ఉంది పాయల్ రాజ్‌పుత్.

Related posts