telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రాజస్థాన్ రాయల్స్ కు షాక్.. కీలక ఆటగాడు దూరం

ఐపీఎల్ 2021 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు మరో షాక్ తగిలింది. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆర్చర్ ఈ సీజన్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇండియాలో జరిగిన సిరీస్ లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్ డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స నిమిత్తం స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా.. ఐపీఎల్ తొలి దశ మ్యాచ్ లకు దూరమైనా.. చివరి దశ పోటీలకు అందుబాటులో ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆర్చర్ గాయం నుంచి కొలుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఐపీఎల్ 14 వ సీజన్ కు అర్చర్ పూర్తిగా దూరమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

Related posts