telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని.. కుటుంబాన్ని న‌డిరోడ్డుపై దించేసి కారును తీసుకెళ్లిన అధికారులు

*సీఎం ప‌ర్య‌ట‌న కోసమ‌ని వాళ్ల కారును తీసుకెళ్లిన అధికారులు
*రాత్రంతా అర్టీసీ స్టాండ్‌లో ఉన్న కుటుంబం..
*ఆర్డీఏ అధికారులు తీరుపై సీఎంఓ సీరియ‌స్‌
*కారులో వెళ్తున్న‌కుటుంబాన్ని న‌డిరోడ్డుపై దించేసిన అధికారులు

ఒంగోలులో పోలీసుల తీరుపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి కాన్వాయి కోసం తిరుమల వెళ్తున్న కుటుంబం నుంచి వెహికల్ లాక్కొని.. ఓ ఫ్యామిలీని న‌డి రోడ్డుపై వదిలేశారు.

వివార్లాలోకి వెళితే

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్‌ కుటుంబం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తోంది. ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్‌ ఇన్నోవా కారులో బయల్దేరారు. రాత్రి పది గంటలకు ఒంగోలులోని ఓ హోటల్ ముందు టిఫిన్ కోసం ఆపారు.

ఆ స‌మ‌యంలో ఓ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఈ వాహనాన్ని సీఎం ప‌ర్య‌ట‌న కోసం ఇవ్వాలని శ్రీనివాస్ ని కోరాడు. తామంతా తిరుపతి వెళ్తున్నామని , పిల్ల‌ల‌తో ఇప్పుడు కష్టమ‌వుతుంద‌ని, ఇవ్వలేమని కానిస్టేబుల్ కు ఆ కుటుంబం తేల్చి చెప్పింది.

సీఎం వైఎస్‌ జ‌గ‌న్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ఏర్పాటుకు సంబంధించి వాహనాల కోసం మీ వాహనం ఇవ్వాల్సిందేనని.. వాహనంతో పాటు డ్రైవర్ ను కూడా కానిస్టేబుల్ తీసుకెళ్లాడు కానిస్టేబుల్.

దీంతో అర్థరాత్రి రోడ్డుపై శ్రీనివాస్ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌ని శ్రీనివాస్ ఫ్యామిలీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Related posts