telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్యే రోజాకు తృటితో తప్పిన ప్రమాదం

నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో సురక్షితంగా దించాడు.

అయితే ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఉదయం 9.20కి రాజమండ్రి నుంచి బయలుదేరిన విమానం ఉదయం 10.20కి తిరుపతికి చేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండ్‌ అయింది. రెండు గంటలుగా ప్రయాణికుల విమానంలోనే ఉన్నారు. విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

Technical Snag For A Flight With MLA Roja On Board

వీరంతా బెంగుళూరులో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇంకా విమానంలోనే ఉన్నాం. విమానం డోర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. పైలట్‌కు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు’ అని రోజా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‎గా మారింది.

Related posts