తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వద్ద టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఈ రాత్రికి కేసీఆర్ కుటుంబం టీటీడీ అతిథి గృహంలో బస చేయనుంది. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు.
కేసీఆర్ తిరుమలలో అడుగుపెట్టడంతో వైసీపీ శ్రేణులు అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరిలో కేసీఆర్, జగన్ లతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. రేపు స్వామివారి దర్శనం అనంతరం హైదరాబాద్ పయనమవుతారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స