telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్ ని తొలగించండి..-సోనియాగాంధీకి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఓ వైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలతో సమావేశం కాగా.. ఈ భేటీకి డుమ్మా కొట్టి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు..

రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగోర్ తీరుపై సోనియాకు రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగోర్ తీరుపై సోనియాకు ఫిర్యాదు చేశారు. తనను తిడుతూ, అవమానపరుస్తూ.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం అలవాటుగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరి కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి తీరు సీనియర్ నాయకలను అవమానించేలా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. తన అనుచరులతో అవమానకరంగా మాట్లాడిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. చండూరు సభ, పార్టీలో చెరుకు సుధాకర్ చేరిక లాంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను ఇవాాళ జరిగిన సమావేశానికి దూరంగా ఉన్నట్టుగా చెప్పారు.

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంతో నాకు సంబంధం లేదు, పాల్గొనను. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా మాకు ప్రాధాన్యత లేదు. నాకంటే పెద్ద లీడర్లు ఉన్నారు కదా వాళ్లే గెలిపించుకుంటారు

ఇవాళ మమ్మల్ని పిలిచి మీటింగ్​కు రమ్మంటే పోయి ఏం చేయాలే. ఇప్పటికే పార్టీని సర్వనాశమైంది. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి పీసీసీని చేశారు. మాణిక్కం ఠాగూర్‌ అభిప్రాయాలు తీసుకున్నట్లు దొంగనాటకాలు ఆడారు. పార్టీని సర్వనాశనం చేసి నాలాంటి కార్యకర్తకు అన్యాయం చేశారు. దాని ప్రతిఫలమే తెలంగాణాలో కాంగ్రెస్‌ నాశనమైంది. కానీ నేను పార్టీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు.

అలాగే మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్ నాథ్ వంటి సీనియర్ నేతలకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు అప్పగించాలని అధినేత్రికి ఆయన తన లేఖలో సూచించారు.

అలాగే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తీసేసి.. అభిప్రాయ సేకరణతో మరో అధ్యక్షడిని నియమించాలని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి.

Related posts