telugu navyamedia
తెలంగాణ వార్తలు

టీఆర్‌ఎస్‌కు షాక్‌: కారు దిగి..చేయి అందుకున్న ఓదేలు..జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి

*చెన్నూరులో మారుతున్న రాజకీయం..
*తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ 

*కారు దిగి..చేయి అందుకున్న నల్లాల ఓదేలు, ఆయన భార్య ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కు భారీ షాక్ త‌గిలింది.. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఢిల్లీలో ఇవాళ సోనియా గాంధీని కలిసిన అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రియాంకా గాంధీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Revanth

చెన్నూరు నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంకా గాంధీ వారికి కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. వీరిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , దామోదర రాజనర్సింహా ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాతో సమావేశం ఏర్పాటు చేయించారు. తర్వాత ప్రియాంకా గాంధీతో కండువా కప్పించారు. నిన్నటి వరకూ వారు పార్టీ మారుతారన్న అంశాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచి.. ఉదయమే వారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీడియాకు లీక్ చేశారు. ఎక్కడా పార్టీ మారకుండా టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేకుండా చూసుకున్నారు.

TRS key leader Nallala Odelu has joined the Congress party along with his wife.

నల్లాల ఓదెలు ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న నేత. 2009, 2014 ఎన్నికల్లో రెండు సార్లు ఆయ‌న‌ చెన్నూరు నుంచి గెలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు.ఈ క్రమంలోనే 2014లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించి ఎమ్మెల్యే గెలుపొందడంతో ప్రభుత్వ విప్​గా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించారు.

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో 2018లో చెన్నూరు నియోజకవర్గం నుంచి నల్లాల ఓదెలు తప్పించి అక్కడ కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్‌కు సీటిచ్చారు. అప్పట్లో ఈ అంశం పై ఓదెలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నల్లాల ఓదెలు సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి జడ్పీటీసీగా గెలిచి జడ్పీ ఛైర్​పర్సన్​గా ఎన్నికయ్యారు.

సుమన్​తో విభేదాలు ఎక్కువ కావడం వల్ల పార్టీలో ఉండలేక కొన్ని రోజులుగా సన్నిహితులు కుటుంబ సభ్యులు అభిమానులతో చర్చలు జరిపి రాత్రి దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ ప్రియాంకాగాంధీ సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

Related posts