కొంతమంది అరాచక శక్తులు దేశాన్ని ఉన్మాదం వైపు నెట్టి వేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాన్ని చూస్తూ మౌనంగా ఉండటం సరైన చర్యగా కాదని చెప్పారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ…అరాచక శక్తులు దేశంలో వినాశనం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
ఇలాంటి ప్రయత్నాలు అర్థమై కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ఏ సమాజాన్నైతే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో… ఆ సమాజం గొప్పగా పురోగమిస్తుందని సీఎం చెప్పారు.
స్వాతంత్ర్యం ఊరికే రాలేదు. ..ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చిందన్నారు. విశ్వజనీనమైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంతటి శక్తిశాలులైనా సరే శాంతియుత ఉద్యమాలతో జయించొచ్చని ప్రపంచ మానవాళికి సందేశం ఇచ్చిన మహ్మత్ముడు పుట్టిన గడ్డ మన భారతావనిఅని.. ఈతరం పిల్లలకు గాంధీ గురించి తెలియాల్సిన అవసరం ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.
జాతీయ గీతాన్ని కోటి మందితో కలిపి సామూహికంగా ఆలపించటం తెలంగాణకే గర్వకారణమన్నారు. గాంధీజీ గొప్పతనం నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సీఎం చెప్పారు
కేసీఆర్, కేటీఆర్ నిర్వహించిన శాఖలు చివరిస్థానంలో ఉన్నాయి: రేవంత్ రెడ్డి