telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ సంచలన నిర్ణయం : కడప బస్‌ స్టేషన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు..

cm Jagan tirumala

చిత్తూరు జిల్లా పుంగనూరు బస్సు డిపోను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం వైయస్‌ జగన్‌. ఈ సందర్బంగా కడప బస్‌ స్టేషన్‌కు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బస్‌ స్టేషన్‌గా పేరు మార్పు చేసింది జగన్ సర్కార్. అలాగే కడపలో ఏపీఎస్‌ఆర్టీసికి చెందిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏరియా ఆస్పత్రిని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం వైయస్‌ జగన్‌. ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పుంగనూరులో బస్సు డిపోను ప్రారంభించడం, అదే మాదిరిగా కడపలో డాక్టర్‌ వైయస్సార్‌ ఏరియా ఆస్పత్రి, ఆర్టీసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. కోవిడ్‌ సమయంలో ఆరోగ్య శాఖతో పాటు, ఆర్టీసీ కూడా ఆస్పత్రిని ప్రారంభించి, సేవలు అందించడం అభినందనీయమని.. ఈ ఆస్పత్రి వల్ల సంస్థ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని పేర్కొన్నారు. వీటిపై ఆనాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని.. ఇది దేవుడు నాకిచ్చిన అదృష్టమని వెల్లడించారు. మీకు ఇంకా మంచి చేయాలని, ఆ అవకాశం దేవుడు నాకివ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు జగన్. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ ఛైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌పీ ఠాకూర్ ఇతర అధికారులు హాజరైయ్యారు.

Related posts