ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్యను రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. వివేకా హత్యకు గల కారణాలు జగన్‌కు తెలుసునని అన్నారు. ఈ కారణంగానే ఆయన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
వివేకాకు అర్థరాత్రి 1.30 గంటలకు ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చిందని, మీ కూతురు వల్ల మా జీవితం నాశనం అయిందని, దానికి తగిన శిక్ష అనుభవిస్తావని ఆ మెసేజ్ లో ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఘటనాస్థలికి మొదట శివప్రకాష్ రెడ్డి వచ్చాడని చెప్పారు. బాబాయ్ హత్యను కూడా రాజకీయం చేస్తున్న జగన్ తీరు గర్హనీయం అని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికే సీబీఐ విచారణ కోరుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఆమోదం తెలిపిన అభ్యర్థుల్నే జగన్ ప్రకటించారని వర్ల ఆరోపించారు.