telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పై శైలజానాథ్…

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.  దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కార్మికులు ఉద్యమం చేపడుతున్నారు.  కార్మిక సంఘాలకు వివిధ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది.  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శైలజానాథ్ స్పందించారు.  సంవత్సరం క్రితమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం చీకటి ఒప్పందం కుదిరిందని శైలజానాథ్ విమర్శించారు.  రెండులక్షల కోట్ల రూపాయల స్కామ్ కు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.  రిమోట్ ను ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకొని, లేఖల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.  విశాఖ ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తీసుకొచ్చారని, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని, కార్మికులతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts