telugu navyamedia
తెలంగాణ వార్తలు

ప్రధాని కార్యక్రమానికి కేసీఆర్‌ డుమ్మా..

తెలంగాణ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ తదితరులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేశ్ కుమార్,డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు

కాగా.. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. నేడు కేసీఆర్‌ స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నార‌ని, అందుకే ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్లుగా సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. జ్వరం తగ్గితే, ముచ్చింతల్‌లో జరిగే శ్రీరామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశముందని సమాచారం.

నిజానికి ప్రధాని పర్యటనకు స్వాగతం పలికేందుకు తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీఎం స్వయంగా ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు తిరిగి వెళ్లేవరకూ కేసీఆర్ పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ.. చివరి నిమిషంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్ల‌లేక‌పోయారు. జ్వరం, స్వల్ప అస్వస్థతతోబాధపడంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. 

Related posts