telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉద్యోగుల సమస్యకి నేటితో యండ్‌కార్డ్ ప‌డ‌బోతుందా..?

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యోగుల నిరసన నేపథ్యంలో మంత్రులు ఉద్యోగ సంఘాలతో అచర్చలు జరిపారు. ఈ రోజు జరిగే సమావేశంలో హెచ్‌ఆర్ఏతో పాటు ఇతర అంశాలు చర్చిస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. అర్ధరాత్రి వరకూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారికి ఉన్న అసంతృప్తులు, అపోహలు తొలగించామన్నారు. పలు డిమాండ్లపై ఉద్యోగులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

ఈ మేరకు ప్రభుత్వానికి ఎదురయ్యే ఆర్థిక పరమైన అంశాలను విశ్లేషించి శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు. నేటితో సమస్యకి‌ పరిష్కారం ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

పిట్ మెంట్ అనేది ముగిసిపోయిన అంశమ‌ని..దీనిలో ఎలాంటి మార్పూ ఉండదని మ‌రోసారి స్పష్టం చేశారు. హెచ్ ఆర్ ఏ, రికవరీ అంశాలపైనే ఇంకా చర్చించాల్సి ఉందని చెప్పారు. వీటిలో కొన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతామని పేర్కొన్నారు.

రికవరీ లేకపోతే ఆర్థిక భారం 5 నుంచి 6 వేల కోట్లు అవుతుందని అన్నారు. హెచ్ ఆర్ ఏ విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉండగా… ఐఆర్, రికవరీ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగాయని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.

వైఎస్సార్‌సీపీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని.. హెచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామని పేర్కొన్నారు.ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు.

మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… ఈరోజు పూర్తి స్థాయిలో పరిష్కారం వస్తుందని, ఉద్యోగులకు నష్టం జరిగేలా తాము ఏ పని చేయమని అన్నారు. సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొంత ఇబ్బంది వచ్చిందని, హెచ్ఆర్ఏ సమస్య పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి మొదటి నుంచి ఉద్యోగులకు మేలు చేస్తామనే చెబుతున్నారని.. అందుకే మంత్రుల కమిటీ కూడా వేశారని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల సమస్యకు ఈ రోజుతో తెరపడే అవకాశం ఉంటుందని చెప్పారు.

Related posts